ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలి
మంగళగిరి ఎన్నారై వైద్యశాలలో ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు 9వ తేదీన కరోనా టీకా వేయించుకున్నారు.
ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉదోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కోవిడ్ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా టీకా వేయించుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఎలాంటి భయాందోళనలకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కోవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు.
టీకా వేయించుకున్న వారిలో రాష్ట్ర అధ్యక్షులు యన్. చంద్రశేఖర్ రెడ్డి భార్య యన్. విజయ చంద్ర, ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, జగదీశ్వరావు, జానకి, అమరావతి కాపిటల్ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు సీవీ రమణ, కార్యదర్శి సీహెచ్ నాగభూషణం తదితరులు ఈ టీకాను వేసుకున్నారు.