ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (13:53 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. కరోనా ఫ్రీగా మూడు జిల్లాలు (video)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రెండు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నా.. మరో మూడు జిల్లాలు మాత్రం కరోనా ఫ్రీ దిశగా సాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,677 శాంపుల్స్ ని పరీక్షించగా 2,665 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 106, చిత్తూరు జిల్లాలో 353, తూర్పుగోదావరి జిల్లాలో 529, గుంటూరు జిల్లాలో 223, కడప జిల్లాలో 161, కృష్ణాజిల్లాలో 281, కర్నూలు జిల్లాలో 33, నెల్లూరు జిల్లాలో 195, ప్రకాశం జిల్లాలో285, శ్రీకాకుళం జిల్లాలో 56, విశాఖపట్నం జిల్లాలో 112, విజయనగరం జిల్లాలో 38, పశ్చిమగోదావరి జిల్లాలో 293 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,843కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18,81,161 మంది కోలుకున్నారు. 
 
గడిచిన 24 గంటల్లో 3,231 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,680కి తగ్గింది. రాష్ట్రంలో గత 24గంటల్లో 16 మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 13,002కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,29,86,288 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు, కరీంనగర్ జిల్లాలో 42, ఖమ్మం జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 869 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. 
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,17,638 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,316 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,729కి పెరిగింది.