తుమ్మినా - దగ్గినా గాల్లో వ్యాపిస్తున్న కరోనా : ఆరోగ్య శాఖ

బుధవారం, 26 మే 2021 (16:36 IST)
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పిడుగులాంటి వార్తను ఒకటి చెప్పింది. కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందన్నారు. 
 
ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కరోనా గాలి ద్వారా దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.
 
కరోనా వైరస్‌తో కూడిన నీటి తుంపర్లను లేదా గాలి తుంపర్లను పీల్చిన వారికి వైరస్ సోకుతోందని తెలిపింది. అంతేకాదు, ఆ తుంపర్లు కళ్లలో, నోటిలో లేదా ముక్కులో పడిన వారికి కూడా వైరస్ సోకుతుందని చెప్పింది. 
 
గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని తెలిపింది. వెలుతురు, గాలి ప్రసరించని గదుల్లో ఎక్కువ మంది ఎక్కువ సేపు గడిపితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపింది.

అన్నీ చూడండి

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments