Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భారత్‌లో కరోనా ఉగ్ర రూపం, కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు

Written By వి
Updated: బుధవారం, 26 ఆగస్టు 2020 (12:55 IST)
భారత్‌లో కరోనా ఉగ్ర రూపం దాలుస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూ ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 32 లక్షల 34 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 67,151 కేసులు నమోదు కాగా 1059 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,173 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. దేశంలో మొత్తం 32,34,474 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,07,267 ఉండగా 59,449 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.30 శాతంగా ఉంది.
 
దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.84 శాతానికి మరణాల రేటు, దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.87 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,23,992 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,76,51,512కి చేరింది.
 

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments