న్యూయార్క్‌లో కరోనా: మాస్క్‌లు లేకుండా తిరగొద్దు.. ఆదేశాలు జారీ
చైనాలో కరోనా మహమ్మారి ప్రజలను నానా తంటాలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు కరోనా మళ్ళీ షాక్ ఇచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఊహించని విధంగా మహమ్మారి ప్రభావం చూపడంతో మళ్ళీ అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అమెరికాలోనే అతిపెద్ద నగరం కావడంతో అక్కడ కరోనా ప్రభావం మొదలైతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన బిడెన్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న అధికారులను అలెర్ట్ చేసింది. ప్రజలను బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా చిన్న పిల్లలను, వ్రుద్దులను బయటకు తీసుకురావద్దంటూ హెచ్చరించింది. అంతేకాదు.. న్యూయార్క్‌లో బహిరంగ ప్రదేశాలలో తిరగే వారు ఎవరైనా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
ఇప్పటికి వ్యాక్సిన్ వేసుకొని వారు వ్యాక్సిన్ వేసుకోవాలని, అలాగే బూస్టర్ డోస్ తీసుకొని వారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.