శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో కొత్తగా 2487 పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా మరో 2487 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్‌లలో 17692 మంది చికిత్స పొందుతున్నారు.  కరోనా నుంచి 2878 మంది కోలుకోగా ఇప్పటివరకు దేశంలో కరనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,79,693కు చేరుకుంమది. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 13 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల  సంఖ్య మొత్తం 5,24,214కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటివరకు 191,32,94,864 కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు.