శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:02 IST)

రోజుకో రికార్డు.. భారత్‌‌లో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 90వేలు

భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇంకా రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఆదివారం నమోదైన వివరాల ప్రకారం 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,802 మంది కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఒక్కరోజులోనే ఏ దేశంలోనూ ఈ స్థాయిలో నిర్ధారణ జరగలేదు. దీంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. 7,20,362 శాంపిళ్లను పరీక్షిస్తేనే ఇలాంటి ఫలితాలు రావడం గమనార్హం.
 
ఆదివారం 1,016 మంది వైరస్ కారణంగా మరణించారు. 69,564 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,614గా ఉంది. 71,642 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 32,50,429 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
 
ఇంకా 8,82,542 మంది చికిత్స తీసుకుంటూ ఉన్నారు. బాధితుల రికవరీ రేటు 77.31 శాతంగా ఉందని ప్రకటించారు. 4,95,51,507 మందికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా 27,292,585 మందికి వ్యాధి సోకింది. వీరిలో 887,554 మంది మృత్యువాతపడ్డారు.