సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (10:52 IST)

దేశంలో కొత్తగా 12899 కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కొత్తగా మరో 12,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,96,692కు చేరుకున్నాయి. ఇందులో 4,26,99,363 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 5,24,855 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 72474 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో అంటే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 15 మంది మహమ్మారికి చనిపోగా 8,515 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొంది. ఇది మొత్తం యాక్టివ్ కేసుల్లో 0.17 శాతమని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 98.62 శాతంగా ఉండగా, మరణాలు రేటు 1.21 శాతంగా ఉందని ఆ ప్రకటన పేర్కొంది.