ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 జూన్ 2022 (20:28 IST)

కోవిడ్‌ అనంతరం ఆర్థిక అనిశ్చితి- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 15 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన ప్రశాంతత

mental tension
అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన నిపుణులు, సలహాదారులతో కూడిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పీస్‌ (ఐఈపీ) తమ గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ 16వ ఎడిషన్‌ను నేడు విడుదల చేసింది. శాంతియుతతకు సంబంధించి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణంగా భావిస్తోన్న ఈ 16వ ఎడిషన్‌ వార్షిక గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ (జీపీఐ) వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా శాంతియుత అనేది 2021లో సరాసరిన 0.3% క్షీణించింది.


గత 14 సంవత్సరాలలో అంతర్జాతీయంగా శాంతియుత ప్రమాణాలు క్షీణించడం ఇది 11వ సారి. దాదాపు 90 దేశాలలో ఇది మెరుగుపడగా, 71 దేశాలలో ఇది క్షీణించింది. తద్వారా పరిస్థితులు మెరుగుపడాల్సింది పోయి ఆ దేశాలలో మరింతగా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఈ నివేదిక సూచిస్తుంది.

 
ఇప్పటికీ అత్యంత శాంతికాముక దేశంగా ఐస్‌ల్యాండ్‌ నిలుస్తుంది. 2008వ సంవత్సరం నుంచి ఈ దేశం తమ స్థానాన్ని నిలుపుకుంటూనే ఉంది. దీనితో పాటుగా ఈ జాబితాలో అగ్రగామి దేశాలుగా న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, ఆస్ట్రియా నిలిచాయి. వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఈ జాబితాలో అతి తక్కువ శాంతియుత దేశంగా ఆఫ్ఘనిస్తాన్‌ నిలిచింది. దీనిని అనుసరించి యెమన్‌, సిరియా, రష్యా, దక్షిణ సూడాన్‌ ఉన్నాయి. ఈ జీపీఐలో అగ్రస్థానంలో నిలిచిన పది దేశాలలో ఏడు  దేశాలు యూరోప్‌లోనే ఉన్నాయి. ఈ సూచీలో అగ్రశ్రేణి దేశాలలో యూరోప్‌కు వెలుపల దేశంగా నిలిచిన ఒకే ఒక్క దేశం టర్కీ.

 
శాంతియుత పరంగా అత్యధిక క్షీణతను ఎదుర్కొన్న ఐదు దేశాలలో రెండు దేశాలుగా రష్యా, ఉక్రెయిన్‌ నిలిచాయి. వీటితో పాటుగా జాబితాలో గినియా, బుర్కినా ఫాసో, హైతీ ఉన్నాయి. ఈ శాంతియుత క్షీణతకు ఈ దేశాలలో ప్రస్తుతం చోటుచేసుకున్న యుద్ధాలే  కారణం. ఈ జీపీఐలో 23 సూచీలు ఉండగా, భారీగా శాంతియుతత పరంగా క్షీణత అనేది పక్క దేశాలతో సంబంధాల పరంగా కనిపిస్తుంది. దీనితో  పాటుగా అంతర్గత పోరాటాల తీవ్రత, శరణార్ధులు, ఐడీపీలు, రాజకీయ టెర్రర్‌, రాజకీయ అనిశ్చితి కూడా కారణమే. మొత్తంమ్మీద 28 దేశాలలో అత్యున్నత స్థాయి అస్థిరత కారణమవుతుంది. అలాగే పది దేశాలలో రాజకీయంగా భయానక పరిస్థితులు ఉన్నాయి.

 
ప్రపంచవ్యాప్తంగా శాంతియుత పరంగా అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. 2008 నుంచి 25 కనీస శాంతియుత దేశాలలో పరిస్థితి సరాసరిన 16% క్షీణించింది. అదే సమయంలో అత్యంత శాంతికాముక దేశాలలో అది 5.1% వృద్ధి చెందింది. 2008 నుంచి 116 దేశాలలో తమ నరహత్యల శాతం తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఈ హింస, 16.5 ట్రిలియన్‌ డాలర్ల నష్టం చేస్తుంది. అంతర్జాతీయ జీడీపీకి 10.9%కు సమానంగా ఇది ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 2,117 డాలర్లు భారంతో ఇది సమానం. హింస కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 10 దేశాలలో, సరాసరి ఆర్ధిక ప్రభావం జీడీపీలో 34%కు సమానంగా ఉంటుంది. కనీస ప్రభావం కలిగన దేశాలలో ఇది 3.6%గా ఉంది.

 
ఈ నివేదికలో పలు సూచీలు పరంగా గణనీయమైన పురోగతి కనిపించింది. దీనిలో టెర్రరిజం ప్రభావం తగ్గడం, న్యూక్లియర్‌, భారీ ఆయుధాలు, అంతర్గత పోరాటాల వల్ల మరణాలు, మిలటరీ వ్యయం, ఖైదు చేసే శాతం, నేర పూరిత భావనలు ఉన్నాయి. ఈ జీపీఐ ప్రారంభించిన నాటి నుంచి టెర్రరిజం ప్రభావం చాలా తక్కువ స్థానంలో ఉంది.

 
ఐఈపీ ఫౌండర్‌- ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ స్టీవ్‌ కిల్లేలియా మాట్లాడుతూ, ‘‘గత సంవత్సరం కోవిడ్‌ 19 కారణంగా ఆర్థిక పరిస్థితులు దిగజారతాయని హెచ్చరించాం. ఇప్పుడు మనం సరఫరా చైన్‌ కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార అభద్రత వంటివి ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనియొక్క రాజకీయ, ఆర్ధిక పరిణామాలు రాబోయే సంవత్సరాలలో ప్రతిధ్వనిస్తాయి.


పొరుగు సంబంధాలు, రాజకీయ అభద్రత, అంతర్గత పోరాటాల తీవ్రత, పేలవమైన స్కోర్స్‌తో కలిసినప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు, నాయకులు తప్పనిసరిగా శాంతి శక్తిని ఉపయోగించుకోవాలి. శాంతి కోల్పోవడం వల్ల కలిగే ఆర్ధిక నష్టం రికార్డు కనిష్టానికి 2021లో చేరుకుంది. ఈ ధోరణిని మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. శాంతియుత సమాజాలు సృష్టించే ధోరణులు, ఇనిస్టిట్యూట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చే దేశాలు మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలవని జీపీఐ వెల్లడిస్తుంది’’ అని అన్నారు.