గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (07:39 IST)

సూర్యాపేట డీహెచ్ఎంపీ ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి కుటుంబంలో ఆరుగురుకి కరోనా వైరస్ బారిపనపపడ్డారు. డీహెచ్ఎంఓతో పాటు.. ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. 
 
డీహెచ్ఎంవో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత బుధవారం ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో డీహెచ్ఎంవో డాక్టర్ కోటాచలంకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
ఆ తర్వాత ఆయన భార్య, పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమార్తెలతో పాటు మరో కుటుంబ సభ్యురాలికి ఈ వైరస్ పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో వారందరికీ కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్‌కు తరలించారు. వీరందరి ఆరోగ్యం బాగానేవుంది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఒమిక్రాన్ లక్షణాలు లేకపోయినప్పటికీ.. వారి శాంపిల్స్‌ను జినోం టెస్టుకు పంపించినట్టు డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. అదేసమయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని కోరారు.