ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (22:05 IST)

ఒక్క మగాడు మినహా.. ఆ గ్రామం మొత్తాన్ని కోవిడ్ సోకింది..?

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. తాజాగా ఒక గ్రామం మొత్తం కోవిడ్ వ్యాపించింది. ఆ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లో వుంది. ఒకే ఒక్కరు మినహా ఆ గ్రామంలోని ప్రజలందరు కరోనా వైరస్ బారినపడ్డారని అధికారులు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్ లోయలోని థొరాంగ్ గ్రామంలోని ప్రజలకు కరోనాతో ఈ క్లిష్ట పరిస్థితి ఎదురైంది. 42మంది ఉన్న ఆ గ్రామంలో 52ఏళ్ల భూషణ్ ఠాకూర్ మినహా మిగిలిన వారంతా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ గ్రామం మనాలి-కెలాంగ్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉంది.
 
దీనిపై భూషణ్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు తాను వండుకుని తింటున్నానని చెప్పాడు. తన కుటుంబ సభ్యులు వేరే గదిలో ఉంటున్నారు. ఫలితాలు వచ్చే వరకు తన కుటుంబంతోనే ఉన్నాను. కానీ, కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాను. ఈ వ్యాధిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. శీతాకాలం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భూషణ్ మీడియాకు వెల్లడించారు. 
 
కాగా, కొద్ది రోజుల క్రితం ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఆ గ్రామస్థులందరూ వైరస్ బారిన పడ్డారని ఆధికారులు ఆరోపిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహాల్‌-స్పితి లోయలోని ప్రజలు కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ జిల్లాలో 30 వేల మంది జనాభా ఉండగా..ఇప్పటివరకు 856 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.