Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రమాద ఘంటికలు.. 157 కరోనా కేసులు

Written By సెల్వి
Updated: సోమవారం, 15 మార్చి 2021 (15:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 35 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌కు మరొకరు బలయ్యారు. కొత్తగా 166 మంది బాధితులు కోవిడ్‌ను జయించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో వెయ్యి 983 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 718 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
 
మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పైకి కదులుతూ ఆందోళన గురిచేస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,291 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 118 మంది కరోనాబారిన పడి మృతిచెందగా.. ఇదే సమయంలో 17,455 కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments