Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేశంలో ఒక్కసారిగా 20 వేలు దాటికి కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 20 జులై 2022 (10:58 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20557 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,38,03,619కు చేరాయి. ఇందులో 4,31,13,623 మంది కోలుకోగా మరో 5,25,785 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,45,654 కరోనా యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. 
 
మరోవైపు గడిచిన 24 గంటల్లో 18517 మంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది. 
 
ఇంకోపైవు, దేశవ్యాప్తంగా ఇప్పటివరు 200.61 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా, రికవరీ శాతం 98.47 శాతంగా ఉంది. మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. 

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments