గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (19:50 IST)

మధ్యప్రదేశ్: ఆర్మీవార్‌ కాలేజ్‌లో 30 సైనిక అధికారులకు కరోనా

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మావ్‌లో ఆర్మీవార్‌ కాలేజ్‌కి చెందిన 30 మంది సైనిక అధికారులకు కరోనా సోకింది. ఇటీవల హయ్యర్‌ కమాండ్‌ శిక్షణ పూర్తిచేసుకొని తిరిగివచ్చిన 115 మంది అధికారులను కరోనా నిబంధనల ప్రకారం.. క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
60శాంపిల్స్‌ను ఇండోర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. 30మంది మిలటరీ అధికారులకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని అన్నారు. దీంతో తాత్కాలికంగా మూసివేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 
 
అయితే పాజిటివ్‌ వచ్చిన సైనిక అధికారుల్లో కరోనా లక్షణాలు లేవని, అందరూ వ్యాక్సిన్‌లు తీసుకున్నారని ఇండోర్‌ చీఫ్‌ మెడికల్‌ అధికారి తెలిపారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కాగా, కాలేజ్‌లో వచ్చిన 30 కేసులతో పాటు మొత్తం ఇండోర్‌ జిల్లా వ్యాప్తంగా 32 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.