గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (11:38 IST)

దేశంలో మళ్లీ 40 వేలు దాటిన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 40 వేలు దాటాయి. శనవారం నాటి కరోనా బులిటెన్ మేరకు 38 వేలుగా ఉన్న పాజిటివ్ కేసులు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో 41,157 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది. అలాగే, నిన్న 42,004  మంది కోలుకున్నారు.
 
మరణాల విషయానికొస్తే... నిన్న‌ 518 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,609కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,02,69,796 మంది కోలుకున్నారు. 4,22,660 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  40,49,31,715 వ్యాక్సిన్ డోసులు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,39,58,663 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,36,709 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.