శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (19:11 IST)

ఆంధ్రాకు కరోనా వైరస్ గుబులు.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ కేసులు... ఇపుడు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 2600కుపైగా నమోదయ్యాయి.
 
రాష్ట్రంలో 91,594 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌ ప్రభావంతో 18 మంది చనిపోయారు. 
 
అలాగే, తాజాగా 2,467 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 18,98,966 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,115 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.