శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (18:24 IST)

ఏపీలో 24 గంటల్లో కొత్త పాజిటివ్ కేసులెన్ని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నిర్ధారణ అయిన కరోనా పాజటివ్ కేసుల సంఖ్యను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా గడిచిన గడిచిన 24 గంటల్లో మొత్తం 70,727 కరోనా పరీక్షలు చేయగా… 1843 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 19,48,592 కి చేరింది. అలాగే ప్రస్తుతం 23,571 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2199 మంది కరోనా నుండి కోలుకున్నారు. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,11,812కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 13,209కి చేరింది.