Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మరికొన్ని రాష్ట్రాలకు కోవాగ్జిన్ సరఫరా : కేంద్రం ఏర్పాట్లు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 24 జనవరి 2021 (15:02 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, అందుబాటులోకి వచ్చిన కోవాగ్జిన్ సరఫరా దేశంలో సాగుతోంది. ఇప్పటికే ఈ కరోనా టీకాల వినియోగం ప్రారంభమైంది. ఈ టీకాల వినియోగంలో అక్కడక్కడా అపశృతులు దొర్లుతున్నాయి. అయితే, కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందుకుసాగుతోంది. 
 
ఈ క్రమలో పూణె కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌‌ను మరో ఏడు రాష్ట్రాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో వచ్చే వారం నుంచి కొవాగ్జిన్‌ను ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 
 
కాగా, శనివారం లక్షా 46 వేల 598 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.37 లక్షలకు చేరింది. ఇప్పటిదాకా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన ఘటనలు 123 నమోదు కాగా.. శనివారం ఒక్కటి కూడా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఘటనల్లో 11 మందికి మాత్రమే పరిస్థితి విషమించిందని, ఏడుగురు చనిపోయారని వెల్లడించింది. ఈ చనిపోయినవారిలో ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన లక్ష్మీ అనే ఆశావర్కర్ కూడా ఉంది. 

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments