Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. ఏపీలో 1288, తెలంగాణలో 956 కేసులు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (20:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,288 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,04,548కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,225 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 8,815 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 8,88,508 మంది రికవరీ అయ్యారు.
 
శుక్రవారంతో రాష్ట్రవ్యాప్తంగా 1,51,46,104 సాంపిల్స్‌ను పరీక్షించారు. గురువారం జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 26, చిత్తూరు 225, తూర్పుగోదావరి 26, గుంటూరు 311, కడప 21, కృష్ణా 164, కర్నూలు 52, నెల్లూరు 118, ప్రకాశం 62, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 191, విజయనగరం 31, పశ్చిమ గోదావరి 7 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
 
మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. అలాగే 9159 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 254, మేడ్చల్‌లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 64, నిర్మల్‌లో 39, జగిత్యాల్‌లో 35 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయి. కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్యశాఖ అప్రమత్తమైంది.

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments