ArogyaAndhraలో దూసుకెళ్తున్న కరోనావైరస్ కేసులు, 24 గంటల్లో 1288
ఆరోగ్య ఆంధ్రలో గడిచిన 24 గంటల్లో 31,116 మంది శాంపిల్స్ పరీక్షించగా 1288 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ కారణంగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, ప్రశాకం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరోవైపు గత 24 గంటల్లో 610 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 1,51,46,104 శాంపిల్స్ పరీక్షించారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,01,653 పాజిటివ్ కేసులకు గాను 8,85,613 మంది డిశ్చార్జ్ కాగా 7,225 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,815. మరిన్ని వివరాలకు దిగువ పట్టిక చూడండి.