శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:38 IST)

స్పీడ్ బ్రేకర్లు లేని కరోనా.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

కరోనా వైరస్‌కు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా దేశంలో పాజిటివ్ కేసు సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 86961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ వల్ల మరో 1130 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో కలుపుకుంటే దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54.87 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. దీంట్లో యాక్టివ్ కేసులు 10,03,299 ఉన్నాయి. ఇక హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 87, 882గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్తగా 1302 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొత్తగా 2230 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 1,41,930 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,042 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 22,990 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 82.22శాతంగా ఉందని తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 266 నిర్ధారణ అయ్యాయి. తర్వాత కరీంనగర్‌లో 102, రంగారెడ్డి 98, సిద్దిపేటలో 92 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.