శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: బుధవారం, 26 ఆగస్టు 2020 (13:05 IST)

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్, కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసినందుకేనా?

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతున్నది. నగరాలు,పట్టణాలు దాటుకొని గ్రామాలకు కూడా సోకింది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిదుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా వైరస్ నిర్ధారణ అయ్యింది.
 
ప్రస్తుతం ఆయన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరారు. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కరునాకర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.
 
కరకంబాడి రోడ్డులోని గోవిందదామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు ఆయన దహన సంస్కారం చేసారు. తనను కలిసిన కార్యకర్తలు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచనలు చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.