బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (12:57 IST)

దేశంలో ఒక్కసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 5,233 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ కారణంగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ నుంచి 3,345 మంది కోలుకున్నారు. 
 
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. సోమవారం 4 వేలకు దిగువున ఉండగా, మంగళవారం ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. అదేసమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది ఆందోళనకు గురిచేస్తుంది. 
 
గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,13,361 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 5,233 మందికి ఈ వైరస్ సోకింది. అంటే, సోమవారం 3,714 కేసులు నమోదు కాగా, మంగళవారం ఈ సంఖ్య 5,233గా ఉంది. అంటే పెరుగుదల శాతం 41 శాతానికి చేరింది. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కేరళలో 2,271, మహారాష్ట్రలో 1,881 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం 1,881 కేసుల్లో ఒక్క ముంబైలోనే 2,271 కేసులు నమోదు కావడం గమనార్హం.