1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

భారత్‌లో మరో 12 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 12,885 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం క‌రోనా నుంచి 15,054 మంది కోలుకున్నారు. అలాగే, క‌రోనా వ‌ల్ల‌ 461 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ప్రస్తతం దేశంలో ప్ర‌స్తుతం 1,48,579 మంది ఆసు‌ప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,37,12,794 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల మొత్తం 4,59,652 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, బుధవారం రోజున 30,90,920 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,07,63,14,440కు పెరిగింది.