గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (09:41 IST)

పెట్రోల్ ధరల్లో పెరుగుదలేగానీ తగ్గుదల కనిపించదే.... జనం గగ్గోలు...

దేశంలో పెట్రోల్, డీజల్ పెరుగుదలకు ఏమాత్రం అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా, ప్రధానమైన మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో ఈ ధరలు పలుకుతున్నాయి. 
 
మంగళవారం లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.49గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.107.40గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.61 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.108.89 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.15 ఉండగా.. డీజిల్ ధర రూ. 107.48గా ఉంది. 
 
ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.04 గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.98.42లకు లభిస్తోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.85కు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర రూ.106.62 ఉంది.