1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:40 IST)

చమురు మంట చల్లారేదెప్పుడు.. మరోమారు పెరిగాయ్

దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతూనేవున్నాయి. గత ఐదు రోజులుగా ఈ పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఆదివారం ఉదయం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై మరో 35 పైసల చొప్పున వడ్డించాయి. 
 
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.109.34, డీజిల్‌ రూ.98.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.79, డీజిల్‌ రూ.101.19, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.04, డీజిల్‌ రూ.102.25కు పెరిగాయి.
 
ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ.113.72కు చేరగా, డీజిల్‌ రూ.106.99కు పెరిగాయి.