గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (09:09 IST)

మగువలకు షాక్.. పెరిగిన పసిడి ధరలు

దేశంలోని మహిళా మణులకు షాక్ తగిలింది. బంగారం కొనుగోలు చేసే మగువలకు ఇది చేదువార్త. దేశంలో మరోమారు బంగారం ధరలు పెరిగాయి. గురువారం రోజున తగ్గిన బంగారం ధరలు.. శుక్రవారం మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
 
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.44,950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,040 కి చేరింది. 
 
ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.69,100 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.