Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌లో కరోనా కలకలం: కేశవరావుకు పాజిటివ్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:36 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలెబ్రిటీ వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్‌లో కరోనా కలకలం రేగింది. టిఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావుకు కరోనా సోకింది. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
కానీ ప్రస్తుతం కేకే ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సమస్య లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే ఉంటూ ఎంపి కేశవరావు చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
 
ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగియడంతో కేశవరావు దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ సమావేశాల సమయంలో ఢిల్లీలోనే వున్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ని కలిశారు. దీంతో కేకేకు సన్నిహితంగా వున్న వారు కరోనా టెస్టులు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. 

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments