మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (17:15 IST)

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ వరల్డ్ రికార్డ్.. 72 బంతుల్లో 172 రన్స్...

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ పరుగుల వరదపారించాడు. మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఏకంగా 172 పరుగుల చేశాడు. ఈ పరుగులు వన్డేల్లోనే.. టెస్టుల్లో చేసినవి కావు.. పొట్టి క్రికెట్ ఫార్మెట్ అ

ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ పరుగుల వరదపారించాడు. మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫించ్ ఏకంగా 172 పరుగుల చేశాడు. ఈ పరుగులు వన్డేల్లోనే.. టెస్టుల్లో చేసినవి కావు.. పొట్టి క్రికెట్ ఫార్మెట్ అయిన ట్వంటీ20లో.
 
జింబాబ్వేతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఫించ్ 72 బంతుల్లో ఏకంగా 172 పరుగులు చేశాడు. టీ-20ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో 156 పరుగులతో తన పేరుతో ఉన్న రికార్డును ఫించ్… మరోసారి తిరగరాశాడు. జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఫించ్.. కేవలం 22 బాల్స్‌లో హాఫ్ సెంచరీ, 50 బాల్స్‌లో సెంచరీ చేశాడు. 
 
ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన ఫించ్.. 26 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. ఫించ్ వీరబాదుడుతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 229 పరుగులు చేసింది. 
 
అనంతర లక్ష్యఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 రన్స్ మాత్రమే చేసి, ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.