శుక్రవారం, 12 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (14:14 IST)

పవన్ కల్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ.. ముంబై తరపున ఆడుతాడట..

ambati rayudu
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. 
 
తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడతానని అంబటి రాయుడు ప్రకటించారు. 
 
గత నెలలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గుంటూరు లోక్ సభ టికెట్‌ను అంబటి రాయుడు ఆశించారు. టికెట్ కేటాయింపుపై పార్టీ నుంచి హామీ లభించలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు.