శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (15:01 IST)

బౌలర్లకూ ఇక హెల్మెట్ తప్పదా? బలంగా బాదడంతో బంతి అక్కడ తాకి?

న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. బంతి తగలడంతో కొందరు గాయాలైతే.. దురదృష్టవశాత్తు మరికొందరు మైదానంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. తాజాగా బ్యాట్స్‌మెన్లతో పాటు భారీ షాట్ల ను

న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. బంతి తగలడంతో కొందరు గాయాలైతే.. దురదృష్టవశాత్తు మరికొందరు మైదానంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. తాజాగా బ్యాట్స్‌మెన్లతో పాటు భారీ షాట్ల నుంచి తప్పించుకునేందుకు బౌలర్లు, అంపైర్లు కూడా హెల్మెట్ ధరించుకోవాల్సిన పరిస్థితి తప్పదేమోనని క్రీడా పండితులు అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే.. దేశవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్, కాంటర్‌బరీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
 
జీత్ రావల్ బ్యాటింగ్ చేస్తుండగా 19వ ఓవర్ వేయడానికి పేసర్ ఆండ్రూ ఎలీస్ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. అతడేసిన బంతిని బ్యాట్స్‌మెన్ బలంగా  బాదడంతో అది నేరుగా వెళ్లి ఆండ్రూ తల ముందు తాకింది. అదృష్టవశాత్తు ఎలీస్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక ఆ బంతి బౌండరీ దాటింది. ముందుగా అంపైర్ దాన్ని ఫోర్‌గా ప్రకటించినా.. రీప్లేలో సిక్సర్ అని నిర్ణయించారు. ఎలీస్‌‌‌కు పెను ప్రమాదం తప్పడంతో వైద్య పరీక్షల అనంతరం మైదానంలో ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేశాడు. 
 
ఇకపోతే.. ఈ మ్యాచ్‌లో రావల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 153 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో 149 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆక్లాండ్ 304 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కాంటర్‌బరి 37.2 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది.