మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:29 IST)

బీసీసీఐ చీఫ్ గంగూలీ పెద్దన్నయ్య భార్యకు కరోనా

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంట కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఆయన పెద్దన్నయ్య భార్యకు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల్లో గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు తేలింది. అలాగే, వారింట్లో పనిచేసే వ్యక్తికి కూడా సోకింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా గంగూలీ కుటుంబ సభ్యులే అయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటున్న వారు కాదని వైద్యాధికారులు తెలిపారు. వారి ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు.