బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (05:58 IST)

టి20లో ట్రిపుల్ సెంచరీ బాదిన ఢిల్లీ బుడతడు

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తనకెవరూ సాటిరారని నిరూపించాడు ఢిల్లీ క్రికెటర్ మొహిత్ అహ్లావత్. టి-20 మ్యాచ్‌లో కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేసి నాటవుట్‌గా నిలచిన ఈ బుడతడు రికార్డు బుక్స్‌ల్లోని అన్ని రికార్డులను గల్లంతు చేసేశాడు. ఢిల్లీలోని లలితా పార

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తనకెవరూ సాటిరారని నిరూపించాడు ఢిల్లీ క్రికెటర్ మొహిత్ అహ్లావత్. టి-20 మ్యాచ్‌లో కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేసి నాటవుట్‌గా నిలచిన ఈ బుడతడు రికార్డు బుక్స్‌ల్లోని అన్ని రికార్డులను గల్లంతు చేసేశాడు. ఢిల్లీలోని లలితా పార్కులో మంగళవారం జరిగిన ట్వీంటీ ట్వంటీ మ్యాచ్‌లో 39 సిక్సర్లు బాదిన 21 ఏళ్ల మొహిత్ ఇకపై కొన్ని దశాబ్దాల పాటు ఎవరూ ఛేదించలేని రికార్డును తన సొంత చేసుకున్నాడు.
 
ఢిల్లీ మావీ లెవెంత్ జట్టు తరపున ఆడుతున్న మొహిత్ ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో ఫ్రెండ్స్ లెవెన్ జట్టుపై పరుగుల వరద సృష్టించాడు. తన జట్టు తరపున ఇంతవరకు మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మొహిత్ ఆ మూడు మ్యాచ్‌లలో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 4 పరుగులు. అలాంటిది మంగళవారం జరిగిన ప్రీమియర్ లీగ్ పోటీల్లో పరుగుల సునామీని సృష్టించాడు. 
 
వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ అయిన మోహిత్ ఏ స్థాయిలోనైనా ట్వంటీ20 మ్యాచ్‌లో త్రిపుల్ సెంచురీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. కేవలం 72 బంతుల్లో 39 సిక్సులు, 14 ఫోర్లుతో 300 పరుగులు చేశాడు. దీంతో అతడి జట్టు మావీ లెవెన్ 20 ఓవర్లలో రెండు వికెట్లకు 416 పరుగులు సాధించడమే కాకుండా తన ప్రత్యర్థిని 216 పరుగుల తేడాతో ఓడించింది. మోహిత్ ఆడిన మైదానం సైజు, బౌలర్ల నాణ్యత వంటి వివరాలు తెలియలేదు. కానీ  18 ఓవర్లవద్ద 250 పరుగులతో క్రీజులో ఉన్న మోహిత్ తదుపరి రెండు ఓవర్లలోనే 50 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో అయితే ఏకంగా 34 పరుగులు బాదాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి 5 బంతుల్లో వరుసగా అయిదు సిక్స్‌లు చేసి నాటౌట్‌గా మిగిలాడు. మోహిత్‌తో పాటు అతడి టీమ్మేట్ గౌరవ్ 86 పరుగులు చేశాడు. 
 
క్లబ్ క్రికెట్ కాకుండా ట్వంటీ 20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పేరుతో ఉంది 2013లో ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన క్రిస్ గేల్ 175 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఇక ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ పోటీల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్ 2013లో ఇంగ్లండ్ జట్టుపై 156 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.