శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (18:03 IST)

జైరా ఎందుకు సారీ చెప్పాలి... అమీర్, షారూఖ్, సల్మాన్ ఖాన్‌లను అడగ్గలరా?: గంభీర్ ప్రశ్న

దేశ వ్యాప్తంగా దంగల్ సినిమాకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. దంగల్ సినిమాలో నటించిన 16 ఏళ్ల దైరా వసీమ్‌‍కు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని

దేశ వ్యాప్తంగా దంగల్ సినిమాకు మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. దంగల్ సినిమాలో నటించిన 16 ఏళ్ల దైరా వసీమ్‌‍కు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని కలడం పట్ల క్షమాపణలు చెప్పాలంటూ కశ్మీర్ యువత సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంపై గంభీర్ మండిపడ్డాడు. 
 
గత ఆరునెలల పాటు కాశ్మీర్ యువత చాలా దాడులను ఎదుర్కొంటున్న తరుణంలో సీఎంను ఎలా కలుస్తున్నావంటూ జైరాపై ఫైర్ అయ్యారు. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. అయితే జైరాను విమర్శిస్తున్న వారిపై గంభీర్ మండిపడ్డాడు. మరోవైపు, జైరాకు రెజ్లర్లు గీతా ఫొగాట్, బబిత ఫొగాట్ లు కూడా అండగా నిలిచారు. జైరా వెనుక తాముంటామంటూ భరోసా ఇచ్చారు.
 
ఇంకా గంభీర్ మాట్లాడుతూ.. 'దంగల్' సినిమాలో నటించడం లేదా మెహబూబా ముఫ్తీతో కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమని... ఆమెతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడం సిగ్గుచేటన్నారు. జైరాతో బలవంతంగా క్షమాపణలు చెప్పించాలనుకోవడం దారుణమని విమర్శించాడు. ఇది పూర్తిగా లింగవివక్షతో కూడుకున్నదని ఆరోపించాడు. 
 
జైరాను అడిగినట్టే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను అడగగలరా? అంటూ సవాల్ విసిరాడు. కేవలం అభద్రతా భావంతోనే జైరాపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డాడు. ఒక బాలిక ఎదగడం చూసి ఓర్వలేకే ఈ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.