బీసీసీఐ చీఫ్ గుంగూలీకి అరుదైన గౌరవం
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీని ఐసీసీ నియమించింది.
ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగుతూ వచ్చిన అనిల్ కుంబ్లే తన పదవీలాకం మూడేళ్లు ముగిసిపోవడంతో ఆ పదవి నుంచి అతను తప్పుకున్నాడు. ఆ స్థానంలో గంగూలీని నియమిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్‌క్లే ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు.
ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్‌ను ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామని, తొలుత ఉత్తమ క్రికెటర్‌గా.. ఆ తర్వాత బోర్డు అడ్మినిస్ట్రేటర్‌గా గంగూలీ అనుభవాలు క్రికెట్ వృద్ధికి ఉపయోగపడుతాయని గ్రెగ్ అన్నారు.