గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (09:11 IST)

అక్టోబరు 23న దాయాదుల పోరు - హాట్ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు

ఐసీసీ ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీలు వచ్చే అక్టోబరు నెల 16వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ పోటీల్లో భాగంగా, దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ జట్లు చాలా కాలం తర్వాత నేరుగా తలపడుతున్నాయి. కీలక మ్యాచ్ అక్టోబరు 23వ తేదీన జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఇందులో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. టిక్కెట్ ధరలను పిల్లలకు రూ.373 (5 డాలర్లు), పెద్దలకు రూ.1493 (20 డాలర్లు)గా నిర్ణయించారు. 
 
అలాగే, ఫైనల్ మ్యాచ్‌తో పాటు మొత్తం 45 మ్యాచ్‌ల టిక్కెట్లను విక్రయానికి ఉంచగా, తొలుత ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లు పూర్తిగా సేల్ అయ్యాయి. కాగా, ఈ మ్యాచ్‌లు అడిలైడ్, బ్రిస్బేన్, హాబర్ట్, పెర్త్, సిడ్నీ, జీలాంగ్ వేదికలుగా నిర్వహిస్తారు.