శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (17:33 IST)

వన్డేల నుంచి ఇమ్రాన్ తాహిర్ అవుట్.. ప్రపంచకప్ తర్వాత టీ-20ల్లో?

2019 ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి వైదొలగనున్నట్లు దక్షిణాఫ్రికా స్టార్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (40) కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు తాను దూరమవుతున్నట్లు ఇమ్రాన్ తాహిర్ చెప్పాడు. నాలుగు పదుల వయస్సులో ప్రపంచ కప్ లాంటి మెగా ఈవెంట్‌లో రాణించడం కష్టమని భావించిన తాహిర్.. వన్డేలకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది.
 
కానీ ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో కొనసాగుతానని తెలిపాడు. దక్షిణాఫ్రికా తర్వాతి తరం స్పిన్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. 2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 
 
ఇప్పటిదాకా ఆడిన 95 మ్యాచ్‌ల్లో 156 వికెట్లు పడగొట్టాడు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు కూడా తాహిర్ పేరిటే ఉంది.