గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:23 IST)

పాకిస్థాన్‌తో మ్యాచ్.. నిర్ణయం ప్రభుత్వానిదే.. విరాట్ కోహ్లీ

కాశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటోంది. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో ఆడే విషయంపై భారత సర్కారు, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిరీస్‌పైనే దృష్టి పెట్టామని చెప్పాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.