ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (20:20 IST)

వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్.. ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా?

వైజాగ్‌లో క్రికెట్‌ ఫీవర్ ప్రారంభం అయ్యింది. భారత్- ఆస్ట్రేలియాల మధ్య ఐదు మ్యాచ్ టీ20 సీరీస్ జరుగనుంది. భారత్‌, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌ గురువారం జరగనుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 
ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి కాస్తయినా ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. 
 
మరోవైపు ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. వరల్డ్ కప్ ఓడిన భారత్.. కంగారూలకు చుక్కలు చూపించాలనుకుంటోంది.