బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (20:13 IST)

నాగ్‌పూర్ టీ20 మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు

ground
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగ్‌పూర్ వేదికగా టీ20 మ్యాచ్ జరగాల్సివుండగా, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ప్రారంభంకావడం మరింత ఆలస్యంకానుంది. 
 
నాగ్‌పూర్‌లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. పిచ్‌ తడవకుండా కవర్లు కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్ కూడా పలు ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో మైదానం మ్యాచ్‌కు అనువుగా సిద్ధం చేసేందుకు మైదానం సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తున్నారు. 
 
మొత్తం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది. దీంతో నాగ్‌పూర్‌లో మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగనుంది.