శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (14:47 IST)

సెమీ ఫైనల్ మ్యాచ్ : రోహిత్ ఔట్... భారత్ స్కోరు ఎంతంటే..

Rohit Sharma
ముంబై వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుంతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఏమాత్రం వెనుకాముందు ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అలాగే, ఈ మ్యాచ్ కోసం బరిలోకి దించిన టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. 
 
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ... ఇది గుడ్ పిచ్ అని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. గొప్ప జట్లలో న్యూజిలాండ్ ఒకటని, ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని తెలిపాడు. ఈరోజు ఎవరు బాగా ఆడితే విజయం వారిదేనని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. 
 
ఇదిలావుంటే, భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ - గిల్‌లు జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 8.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగులు చేసి మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్ 21, విరాట్ కోహ్లీ 4 పరుగులతో ఆడుతున్నారు. 
 
తుది జట్లు:
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్, సిరాజ్. 
 
న్యూజీలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియంసన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్ మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంటర్న్, టిమ్ సౌథీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్.