శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (19:18 IST)

శ్రీలంకను వైట్ వాష్ చేసిన టీమిండియా: ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో చారిత్రక విజయం

భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మూడో, చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించడం ద్వారా శ్రీలంకను కోహ్లీ సేన వైట్ వాష్ చేసింది. తద్వారా మూడు టెస్టుల మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చే

భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మూడో, చివరి టెస్టులో భారత జట్టు విజయం సాధించడం ద్వారా శ్రీలంకను కోహ్లీ సేన వైట్ వాష్ చేసింది. తద్వారా మూడు టెస్టుల మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంకలో పర్యటిస్తూ రెండు టెస్టులాడిన భారత్.. సిరీస్‌ను కైవసం చేసుకుని మూడో టెస్టు బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు సాధించింది. 
 
భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్ 119 పరుగులు సాధించాడు. పాండ్యా సూపర్ సెంచరీతో 108 పరుగులు తీశాడు. రాహుల్ 85, కోహ్లీ 42 పరుగులు సాధించి  స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆపై బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి మెరుగ్గా రాణించలేకపోయింది. కెప్టెన్ చండీమాల్ మాత్రం 48 పరుగులు సాధించి.. జట్టులో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. తద్వారా 135 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. పిమ్మట శ్రీలంక ఫాలో ఆన్ ఆడినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
భారత బౌలర్ల తరపున కుల్ దీప్ యాదవ్ 4 వికెట్లు, షమీ, అశ్విన్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 181 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తద్వారా భారత్ ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ తరపున అశ్విన్ నాలుగు వికెట్లు, షమీ మూడు వికెట్లు  సాధించారు.