ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (17:11 IST)

ఆసియాకప్‌..పాక్ చేతిలో ఓటమి.. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ ఆశలు

team india
ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించిన శ్రీలంక పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. టోర్నీ ప్రారంభమ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో ఊపుమీదుంది.

ఇక పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు మరికాసేపట్లో శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత తప్పకుండా, అది కూడా భారీ విజయం సాధిస్తే ఏ ఆటంకాలు లేకుండా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. లేదంటే ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఓటమిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 
 
మరోవైపు భారత జట్టు కూడా బలంగానే ఉంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన సూపర్-4లో అదే పాకిస్థాన్‌ చేతిలో ఓడి ఒత్తిడిలోకి జారుకుంది. స్కోరు బోర్డుపై 181 పరుగులు ఉంచినప్పటికీ బౌలింగులో సత్తా చాటలేక చతికిలపడింది.
 
ప్రీమియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత జట్టు కూర్పులో సమతూకం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలింగ్ తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్ తో జరిగే మ్యాచ్ పైన భారత్ ఆశలు పెట్టుకుంది.