సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2023 (20:46 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ చేజారుతోంది... విజయం దిశగా ఆస్ట్రేలియా

aus batters
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు చేరిన భారత్‌.. తుదిపోరులో తడబడి కప్పును కోల్పోనుంది. బ్యాటర్లతో వైఫల్యంతో 240 పరుగులకే పరిమితమైన భారత క్రికెట్ జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా కంగారులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. 
 
ఈ ఏడాది ది ఓవల్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో సెంచరీ చేసి భారత్‌కు గద దూరం చేసిన ట్రావిస్‌ హెడ్‌.. మరోసారి భారత పాలిట విలన్‌‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదేశాడు. 34.1 ఓవర్లలో 191 పరుగులు చేసింది. ఈ దశలో భారత్‌ మ్యాచ్‌ గెలవాలంటే అద్భుతానికి మించిన అద్భుతం జరగాల్సిందే.
 
ఈ మ్యాచ్ ఆరంభంలో కంగారులు తడబడినప్పటికీ ఆ తర్వాత కుదురుకుని భారత బౌలర్లను బాదేశారు. భారత్‌ నిర్దేశించిన 241 పరుగుల ఛేదనలో ఆసీస్‌ ఇదివరకే సగం టార్గెట్‌ను ఊదేసింది. 25 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్‌.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసి విజయానికి గట్టి పునాది వేసుకుంది. 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : ఆస్ట్రేలియాకు మూడు వికెట్లు డౌన్ 
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రుగుతున్న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో భార‌త్, ఆస్ట్రేలియా జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50  ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ ఛేదనకు దిగింది. 
 
వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత జట్టు నిర్దేశించిన 241 పరుగులతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌లు ఓపెనర్లుగా వచ్చి ఆసీస్‌ ఛేదనను మొదలుపెట్టారు. తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో.. హెడ్‌ రెండు బౌండరీలు కొట్టగా వార్నర్‌ ఒక ఫోర్‌ కొట్టాడు.
 
భారత పేసర్ మహ్మద్‌ షమీ భారత్‌కు తొలి బ్రేకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే మహ్మద్‌ షమీ.. డేవిడ్‌ వార్నర్‌ (7)ను ఔట్‌ చేశాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయిన వార్నర్‌.. ఫస్ట్‌ స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ వరల్డ్‌ కప్‌లో షమీకి ఇది 24వ వికెట్‌. వరల్డ్‌ కప్‌ 2023లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ల జాబితాలో షమీ స్థానం దక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత షమీ వేసిన రెండో ఓవర్లో ఆసీస్‌ డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ కూడా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తాను ఎదుర్కున్న రెండో బంతికే కవర్‌ పాయింట్‌ మీదుగా ఫోర్‌ కొట్టిన మార్ష్‌.. షమీనే వేసిన నాలుగో ఓవర్లో లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. 
 
ఆ క్రమంలో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియా  టాపార్డర్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ వికెట్‌ కూడా బుమ్రాకే దక్కింది. బుమ్రా వేసిన ఏడో ఓవర్లో ఆఖరి బంతికి స్మిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఏడు ఓవర్లకు ఆసీస్‌.. మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.