శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (11:43 IST)

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు : వరుసగా మూడో సెంచరీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో కోహ్లీ.. వెస్టిండీస్‌తో పూణె వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. వరుసగా మూడు వన్డేల్లోనూ కోహ్లీ మూడు సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. కెరీర్‌లో అతనికిది 38వ సెంచరీకావడం విశేషం. 
 
లక్ష్య ఛేదనలో మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసినా కోహ్లీ ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయపథంలో నడిపించలేక పోయాడు. కాగా, వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ రికార్డు సృష్టించగా, ఓవరాల్‌గా పదో ఆటగాడు కావడం గమనార్హం. అలాగే, వన్డేల్లో 38 సెంచరీలు చేయగా, వెస్టిండీస్‌పై మొత్తం ఏడు సెంచరీలు చేశాడు.