మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:00 IST)

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ధర రూ.14.5 కోట్లు.. పైసాకు అమ్ముడుపోని ఇషాంత్ శర్మ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో పాల్గొనే ఆటగాళ్ళ వేలం పాటలు సోమవారం జరిగాయి. ఈ వేలం పాటల్లో కీలకమైన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచేజీ జట్లు పోటీపడ్డాయి. ఫలితంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో పాల్గొనే ఆటగాళ్ళ వేలం పాటలు సోమవారం జరిగాయి. ఈ వేలం పాటల్లో కీలకమైన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచేజీ జట్లు పోటీపడ్డాయి. ఫలితంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ పోటీపడ్డాయి. ఫలితంగా... స్టోక్స్ ఏకంగా రూ.14.5 కోట్ల ధర పలికాడు.

ఈ ఆటగాడిని రైజింగ్ పూణె వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ వేలం పాటల్లో ఒక్కో ఆటగాడి ప్రారంభ ధర రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.2 కోట్లుగా నిర్ణయించారు. అయితే, అయితే బేస్ ప్రైస్‌ను మించి వేలంలో ధర పలకడంతో విదేశీ ఆటగాళ్లు ఉబ్బితబ్బిబవుతున్నారు. మరికొందరు ఆటగాళ్లు మాత్రం పూర్తి నిరాశలో మునిగిపోయారు. మరికొందరు సీనియర్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు అనాసక్తి చూపాయి. సుమారు 350 మంది బరిలో ఉన్న ఈ ఆక్షన్‌లో కనీసం 76 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. పదేళ్ల ఐపీఎల్‌లో ఇదే చివరి వేలం.
 
ఈ వేలం పాటల్లో బెన్ స్టోక్స్ రూ.14.5 కోట్ల ధర పలికాడు. అలాగే, మిల్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రూ.12 కోట్లు, రబడ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) రూ.5 కోట్లు, ఆండ్రూ మాథ్యూస్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) రూ.2 కోట్లు, పవన్ నేగి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కోటి రూపాయలు, మోర్గాన్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) రూ.2 కోట్లు, ఆండ్రసన్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) కోటి రూపాయలు, బౌల్ట్ (కోల్‌కత్తా నైట్ రైడర్స్) రూ.5 కోట్లు, క్యుమ్మిన్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) రూ.4.5 కోట్లు, మిచ్చెల్ జాన్సన్ (ముంబై ఇండియన్స్) రూ.2 కోట్లు చొప్పున ధర పలికారు.