శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (17:19 IST)

లెజెండ్ లీగ్ క్రికెట్ షెడ్యూల్... 75వ స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్ మ్యాచ్

Legends League Cricket 2022
Legends League Cricket 2022
లెజెండ్ లీగ్ క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుగా స్పెషల్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 15న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు లెజెండ్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం తెలిపింది. ఈ మ్యాచ్‌లో మొత్తం పది దేశాలకు చెందిన క్రికెట్ ప్లేయర్లు పాల్గొంటారు. 
 
ఈ మ్యాచ్ అనంతరం సెప్టెంబర్ 16 నుంచి లీగ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 4 జట్లు లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీ ఫార్మాట్‌లో పోటీపడనున్నాయి. 
 
జట్లు వివరాలు..
సౌరవ్ గంగూలీ (సి), సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా, జోగిందర్ శర్మ.
 
వరల్డ్ జెయింట్స్.. ఇయాన్ మోర్గాన్ (సి), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అప్టసన్, కెవిన్ ఓ బ్రియన్, దినేషన్ రామ్‌దిన్.