ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (22:11 IST)

36 సంవత్సరాల తర్వాత క్రికెట్‌కు ఆతిథ్యమిచ్చిన కాశ్మీర్

cricket statidum
కాశ్మీర్ 36 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఫుట్‌బాల్ మైదానంగా ఉన్న బక్షి స్టేడియం లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు వేదికగా మారింది. ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ గేల్ వంటి క్రికెట్ దిగ్గజాలతో సహా దాదాపు 120 మంది ఆటగాళ్లను ఈ టోర్నమెంట్ శ్రీనగర్‌కు తీసుకువచ్చింది. 
 
ఎల్ఎల్‌సి సహ వ్యవస్థాపకుడు, రామన్ రహేజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, "యువతరానికి స్ఫూర్తినిచ్చేలా క్రికెట్, ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ లీగ్ ముఖ్య లక్ష్యమన్నారు. కాశ్మీర్ ఇంతకు ముందు రెండుసార్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 
Legends League Cricket
Legends League Cricket
 
1983, 1984లో, షేర్-ఇ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో, భారతదేశం, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌లు జరిగాయి. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ట్రోఫీని కైవసం చేసుకునేందుకు కోణార్క్ సూర్యస్ ఒడిశాను చిత్తు చేయడంతో మ్యాచ్ సదరన్ సూపర్ స్టార్స్‌కు అనుకూలంగా మారింది.