సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (14:10 IST)

శోభనం రోజు కాదు తర్వాత రోజు బ్యాటింగ్ చేశాం.. సీక్రెట్ వెల్లడించిన అశ్విన్ భార్య

భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌ స్థాయిగా ఎందిగిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈయన సరిగ్గా ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఆరేళ్ళ నాటి సంఘటనను ఆయన భార్య ప్రీతి తాజాగా వెల్లడించింది.

భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌ స్థాయిగా ఎందిగిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈయన సరిగ్గా ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఆరేళ్ళ నాటి సంఘటనను ఆయన భార్య ప్రీతి తాజాగా వెల్లడించింది. 
 
అదేంటంటే... శోభనం రాత్రి ఏం జరిగిందన్న విషయం తెల్సిందే. ఓ స్వీట్ సీక్రెట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. సరిగ్గా ఆరేళ్ల క్రితం తమ వివాహం అయిందని చెబుతూ, తమ ఫస్ట్‌నైట్ మరుసటి రోజే, మ్యాచ్‌ ఉండటంతో అశ్విన్‌‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు సూచించారని గుర్తు చేసుకుంది. 
 
ఆ రోజు రాత్రంతా టీమ్‌‌కు చెందిన రహస్య అల్లారంలు రాత్రాంతా మోగాయని, తర్వాత రోజు మేం బ్యాటింగ్‌ చేశామంటూ సరదాగా చెప్పుకొచ్చింది. అది అశ్విన్‌‌కు తొలి టెస్ట్‌ మ్యాచ్‌ అని, తొలిసారి చూసినప్పుడు మైదానంలో అశ్విన్‌ను గుర్తించలేక పోయానని చెప్పిన, ప్రీతి, ఇప్పుడు ఏకంగా 300 వికెట్లు తీశాడని పేర్కొంది. ఇక ఈ లవ్లీ మెసేజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.