చైనా సూపర్ సిరీస్: ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధు.. సున్ యుతో ఢీ..
చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అదరగొట్టింది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్
చైనా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అదరగొట్టింది. కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు కేవలం అడుగుదూరంలో నిలిచింది. ఈ ఈవెంట్లో హైదరాబాదీ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ సింధు 11-21, 23-21, 21-19 స్కోరుతో ఆరో సీడ్ సుంగ్ జి హ్యున్‌పై విజయం సాధించింది.
సెమీఫైనల్ పోరులో పీవీ సింధు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. మ్యాచ్ ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ తర్వాత సాగిన రెండు గేమ్‌ల్లో సింధు సుంగ్ జి హ్యున్‌పై గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సున్ యుతో తలపడనుంది.